రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

కర్నూలు: ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో హుసేనాపురం గ్రామానికి చెందిన రవి (25) తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడు రవికి వివాహం కాలేదు. ఓర్వకల్లు ఎస్ఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.