రహదారి, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన
కృష్ణా: పెనమలూరు మండలం కానూరులో రూ.37 లక్షలతో నిర్మించనున్న రహదారి, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిన్న శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించేందుకు నిరంతరంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.