కుటుంబ సర్వే మూడు రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్
కాకినాడ జిల్లాలో జరుగుతున్న ఏకీకృత కుటుంబ సర్వేను మరో మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం మండల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 7,55,812 కుటుంబాలకు ఇప్పటివరకు 6,51,697 కుటుంబాల సర్వే పూర్తయిందన్నారు. మిగిలిన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.