ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ట్రాక్టర్
ప్రకాశం: సింగరాయకొండ జగనన్న కాలనీ సమీపంలో ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన గురువారం రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రుడు మండలంలోని ఉల్లపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసరావుగా పోలీసులు గుర్తించారు. చికిత్స నిమిత్తం అడిని ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.