యుద్ధానికి బ్రేక్.. తగ్గిన ధరలు
ఇరాన్‌పై యుద్ధాన్ని ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లలో జోష్ నెలకొంది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఏకంగా 17 డాలర్లు తగ్గి, బ్యారల్ ధర 96 డాలర్లకు చేరుకుంది. అలాగే బ్రెంట్ క్రూడ్ ధర కూడా 13 శాతం మేర తగ్గింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.