రేపటి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటన వివరాలు

NLR: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం కోవూరు మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు కోవూరు పట్టణంలోని పెళ్లకూరు కాలనీ పరిధిలోని 4,5,6 వార్డుల సందర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.