మురికి నీరు నిలువ ఉండకుండా చూడాలి

ADB: వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని మురికి నీరు నిల్వ ఉండకుండా చూడాలని తాంసి ఎంపీఓ లింగయ్య పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పొన్నారి గ్రామంలో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తపై అవగాహన కల్పించారు. అనంతరం స్థానికంగా ఆరోగ్య సమస్యలు గల వారికి మందులను అందజేశారు. కార్యక్రమంలో PHC హెల్త్ సూపర్వైజర్ తులసి రామ్, తదితరులు ఉన్నారు.