తిరుమలలో ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

తిరుమలలో ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

తిరుమలలోని గజశాలలో ఏనుగులను ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. షెడ్లలో ఆహారం, నీరు తదితర సౌకర్యాలు కల్పించారు. వేసవి దృష్ట్యా ఫ్యాన్లు ఏర్పాటు చేసి చల్లని వాతావరణం కల్పిస్తున్నారు. రోజూ నిర్వాహకులు ఏనుగులకు స్నానం చేయించడం, పోషకాహారం అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీవారి సేవల్లో పాల్గొనే ఈ గజరాజులకు ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందిస్తున్నారు.