VIDEO: వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
AKP: కోటవురట్ల రామాలయం వద్ద శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సీతారామచంద్రుల ఉత్సవ విగ్రహాలను ఆలయం బయట అధిష్టింపచేసి, వేద పండితులు అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తుల సమక్షంలో కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. భక్తులకు పానకం, ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డీవీఎస్ రాజు, ఎంపీటీసీ పీవీ సూర్యారావు పాల్గొన్నారు.