VIDEO: మృతదేహాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

BPT: అద్దంకిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం గ్రానైట్ క్వారీలో మృతిచెందిన నలుగురు కార్మికులను మార్చురీలో ఉంచారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గంగాధర్, డీఎస్పీ నాగేశ్వరరావులు ఆసుపత్రి వద్దకు చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గ్రానైట్ బండల మధ్య గ్యాప్ ఏర్పడి ప్రమాదం జరిగి ఉండవచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు.