తమిళనాడు ఎన్నికల బరిలో స్టార్‌ దర్శకుడు

తమిళనాడు ఎన్నికల బరిలో స్టార్‌ దర్శకుడు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ డైరెక్టర్ సుందర్‌ సి పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని 'పుతియ నీతి కట్చి' అభ్యర్థిగా మధురై సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. సుందర్‌ సతీమణి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ మాట్లాడుతూ 3 దశాబ్దాల సినీ ప్రస్థానానికి అండగా నిలిచిన రాష్ట్రానికి సేవ చేయడమే తన భర్త లక్ష్యమన్నారు.