వైభవంగా గణేశ్ నిమజ్జన వేడుకలు

వైభవంగా గణేశ్ నిమజ్జన వేడుకలు

KNR: తుళ్లూరులో వినాయక నిమజ్జన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. విగ్రహ ఊరేగింపు మేళతాళాలతో సందడిగా సాగింది. తుళ్లూరు గొల్లగొంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఊరేగింపులో బోనాల నృత్యం, కోలాటం, తప్పెట్లు, చెక్క భజన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఊరేగింపులో యువకులు, చిన్నారులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.