VIDEO: కంభంలో ఘనంగా అంకాలమ్మ తిరుణాల

ప్రకాశం: కంభంలోని స్థానిక తెలుగు వీధిలో అంకాలమ్మ తిరునాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ నిర్వహకుల ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. ఈ తిరుణాలకు భారీ సంఖ్యలో మండల ప్రజలు హాజరయ్యారు.