13న జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఎంపిక పోటీలు: ఈశ్వర్

13న జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఎంపిక పోటీలు: ఈశ్వర్

KRNL: కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో ఈనెల 13న జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు మంగళవారం జిల్లా సంఘం కార్యదర్శి ఈశ్వర్ నాయుడు తెలిపారు. ఈ ఎంపిక పోటీలు సీనియర్ పురుషుల, స్త్రీల విభాగంలో ఉంటాయని తెలిపారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, ఈ నెల 18 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.