మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: ఇస్నాపూర్ 11వ వార్డులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. కౌన్సిలర్ సుల్తాన్పురం ఈశ్వరమ్మ తన ఎన్నికల హామీని నెరవేరుస్తూ ప్రజల సౌకర్యార్థం ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పాలక వర్గం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.