రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం బాతుగుడబ గ్రామానికి బీటీ రోడ్డు పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే జగదీశ్వరి మంగళవారం శంకుస్థాపన చేశారు. మూలబిన్నిడి ప్రధాన రహదారి నుంచి బాతుగుడబ గ్రామానికి రూ.70 లక్షలతో 2.2 కిలోమీటర్లు రోడ్డు పనులు జరుగుతాయన్నారు. ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి ఈ రోడ్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది పేర్కొన్నారు.