తహసీల్దార్ కార్యాలయం ముందు మహిళ నిరసన

తహసీల్దార్ కార్యాలయం ముందు మహిళ నిరసన

BPT: కొల్లూరు తహసీల్దార్ కార్యాలయం ముందు పెదలంక గ్రామానికి చెందిన బసవపూర్ణ అనే మహిళ బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. గ్రామ సర్వేయర్ తనను ఇబ్బంది పెడుతున్నారని, ఈ-పంట నమోదు పత్రాలు ఇవ్వడం లేదని ఆమె ఆరోపించింది. బసవపూర్ణ మాట్లాడుతూ.. గ్రామ సర్వేయర్ నాగమణి తన నుంచి ఈ-పంట సంబంధిత పత్రాల కోసం రూ.20 వేలు లంచం తీసుకున్నా, ఇప్పటికీ పత్రాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.