ముశ్రీఫా వాగును పరిశీలించిన తహసీల్దార్

NRPT: కోస్గి మండలంలో ముశ్రీఫా వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో దౌల్తాబాద్ - కోస్గి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ బక్క శ్రీనివాసులు, ఇరిగేషన్ డీఈ ఆనంద్ కిషోర్‌తో కలిసి ముశ్రీఫా వాగును పరిశీలించారు. ప్రజల భద్రత కోసం ఎవరు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.