కనువిందు చేసిన లక్షలాది ఫ్లెమింగ్ పక్షులు
గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో లక్షలాది ఫ్లెమింగో పక్షులు కనువిందు చేశాయి. ఇందుకు సంబంధించిన అద్భుతమైన డ్రోన్ వీడియోను మంత్రి హర్ష్ సంఘవి షేర్ చేయగా వైరల్ అవుతోంది. సాధారణంగా తెల్లగా ఉండే ఈ పక్షులు, అక్కడి నాచులోని పోషకాల వల్ల క్రమంగా పింక్ రంగులోకి మారుతాయని నిపుణులు తెలిపారు. ఈ అరుదైన దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.