VIDEO: భక్తులతో కిక్కిరిసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి
CTR: పుంగనూరు మండలంలోని గూడూరు పల్లి గుట్ట భక్తులతో కిక్కిరిసింది. కదిరి పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో విశేష పూజలు జరిగాయి. మొదట మూలవర్లను అర్చకులు అభిషేకించి వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తరువాత భక్తుల దర్శనార్థం ఉత్సవ మూర్తులను అలంకరించి కొలువు తీర్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు.