శరవేగంగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం

శరవేగంగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం

GNTR: మంగళగిరిలో సుమారు రూ.140కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని దేశంలోని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ ఎంతో కృత నిశ్చయంతో ఉన్నారు.ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆయన ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణంతో రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.