ఎమ్మెల్యే కార్యాలయంలో దొమ్మేటి జయంతి వేడుకలు

ఎమ్మెల్యే కార్యాలయంలో దొమ్మేటి జయంతి వేడుకలు

కోనసీమ: పీ. గన్నవరంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇది శెట్టిబలిజల చరిత్రలో ఒక చారిత్రక ఘట్టమని తెలిపారు.