మహిళను వేధించిన వ్యక్తి పై కేసు నమోదు

మహిళను వేధించిన వ్యక్తి పై కేసు నమోదు

NRPT: దామరగిద్ద మండలం కంసాన్ పల్లి గ్రామంలో మహిళను లైంగికంగా వేధిస్తున్న బొగ్గుల కనకప్ప అనే వ్యక్తిపై కేసు నమోదైంది. రెండేళ్లుగా సదరు మహిళను వేధిస్తున్న నిందితుడు, సోమవారం ఉదయం ఆమె చెత్త వేయడానికి వెళ్తుండగా వెంబడించి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.