'ప్రభుత్వ ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు'

CTR: పుంగనూరు ప్రభుత్వ ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సివిల్, డీజిల్ మెకానిక్ కోర్సులతోపాటు మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులలో సీట్లు ఖాళీ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఆగస్టు 26న కళాశాలలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు.