అమెరికా ‘ఫ్రీడమ్‌ 250’ పోస్టర్లతో ఆటోలు

అమెరికా ‘ఫ్రీడమ్‌ 250’ పోస్టర్లతో ఆటోలు

ఈ ఏడాది జూలై 4న 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని అమెరికా జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ‘ఫ్రీడమ్ 250’ పోస్టర్లు ఉన్న ఆటోలను ఢిల్లీలో ఆవిష్కరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ అమెరికా చిత్రాలతో కూడిన పోస్టర్లు ఉన్న ఆటోలు ఢిల్లీ అంతటా పరుగులు తీస్తాయని తెలిపారు.