బాలికలకు చట్టాలపై అవగాహన అవసరం
VZM: బాలికలకు చట్టాలపై అవగాహన అవసరమని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ. విజయ్ రాజ్ కుమార్ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని శనివారం గజపతినగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు ర్యాలీ జరిగింది. ప్రభుత్వం కల్పిస్తున్న చట్టాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బాల్యవివాహాల వలన కలిగే అనర్థాలను వివరించారు.