విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. LRS డిపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హాట్ మెటల్ కింద పడడంతో భయంతో ఉద్యోగులు బయటికి పరుగుతీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా... ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.