పొలాల్లో నీరు దిగువకు పోయేలా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

పొలాల్లో నీరు దిగువకు పోయేలా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

కృష్ణా: తుఫాను కారణంగా ముంపుకు గురైన పంట పొలాలలోని నీరు బయటకు పోయేందుకు వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లోని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నిర్వహించారు.