ఈనెల 16న రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే కుంగ్ ఫూ పోటీలు
మంచిర్యాల జిల్లా నస్పూర్ కరాటే అండ్ ఫిట్‌నెస్ అకాడమీ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ స్మారకార్ధం ఈనెల 16న రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే కుంగ్ ఫూ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. నస్పూర్ కాలనీ గోదావరి ఫంక్షన్ హాల్‌లో ఈ పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.