ప్రపంచ విజేత కరుణకుమారికి ఘనస్వాగతం
NTR: తొలి టీ-20 మహిళా బ్లెండ్ వరల్డ్ కప్ విజేత, తెలుగు క్రీడాకారిణి పాణంగి కరుణకుమారికి సోమవారం విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కరుణకుమారికి శాప్ ఛైర్మన్ రవినాయుడు, ఎండీ ఎస్. భరణి, క్రీడాకారులు, విద్యార్థులు స్వాగతం పలికి, ప్రపంచ కప్ విజయాన్ని పురస్కరించుకుని సత్కరించారు.