'గర్భిణీలు పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి'
నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం పట్టణం పెద్దూరులోని హరిజనవాడ అంగన్వాడీ పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్త సుబ్బమ్మ ఆధ్వర్యంలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్‌వైజర్ పద్మావతి పాల్గొని గర్భిణీలకు పలు సూచనలు చేశారు. గర్భిణీలు పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలన్నారు. చిన్నారులకు ఫోన్‌లు ఇవ్వద్దని సూచించారు.