పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
AP: టీటీడీ పరకామణి చోరీ కేసులో హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో తప్పేముందని కోర్టు ప్రశ్నించింది. అది ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనని పేర్కొంది. పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్ దగ్గర రాజీ చేసుకునే అవకాశం లేదని మాత్రమే సింగిల్ బెంచ్ చెప్పిందని స్పష్టం చేసింది. అనంతరం విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.