నాగార్జునసాగర్‌ను సందర్శించిన 24 దేశాల ప్రతినిధులు

నాగార్జునసాగర్‌ను సందర్శించిన 24 దేశాల ప్రతినిధులు

NLG: భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థలో ఈ నెల 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు శిక్షణ పొందుతున్న 24 దేశాలకు చెందిన 37 మంది ప్రతినిధులు బుధవారం నాగార్జునసాగర్‌ను సందర్శించారు. ప్రధాన డ్యామ్ జలాశయం, జల విద్యుత్ కేంద్రాలను పరిశీలించారు. సాగర్ ప్రాజెక్టు చరిత్రపై ఇరిగేషన్ అధికారులు వారికి వివరించారు.