నామినేషన్లు ముగియడంతో.. బుజ్జగింపుల షురూ..!
HNK: పరకాల మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో నేడు ప్రధాన పార్టీల నేతలు, ఆశావహ అభ్యర్థులు బుజ్జగింపుల పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ పరంగా జరిగే ఎన్నికలు కావడంతో ఒక్కో స్థానానికి ఒకరికే టికెట్ కేటాయించనుండటంతో పోటీలో ఉన్నవారిలో ఉత్కంఠ నెలకొంది. పరకాల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా, ఛైర్మన్ పీఠాన్ని జనరల్‌కు కేటయించారు.