'హిందూ సమ్మేళనానికి భారీగా తరలిరావాలి'
MNCL: చెన్నూరు మండల కేంద్రంలోని శ్రీ జగన్నాథ ఆలయంలో ఆదివారం నిర్వహించే హిందూ సమ్మేళనం కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వేలాదిగా తరలిరావాలని హిందూ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ సద్గురు మహదేవ్ స్వామీజీ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 5.00 గం.లకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి నిర్వహకులు తెలిపారు.