పెన్షన్ కోసం వచ్చిన మహిళ దారుణ హత్య

PLD: దాచేపల్లి మండలం పెదగార్లపాడులో దారుణం చోటుచేసుకుంది. ముత్యం పోలమ్మ (50) దారుణ హత్యకు గురయ్యారు. గుంటూరులో నివసించే పోలమ్మ పింఛన్ కోసం తన స్వగ్రామం పెదగార్లపాడు వచ్చారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.