'గృహ లక్ష్మీ బిల్లు మంజూరు చేయండి'

'గృహ లక్ష్మీ బిల్లు మంజూరు చేయండి'

KMR: బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన గృహలక్ష్మి లబ్ధిదారులు సోమవారం సబ్ కలెక్టర్ కిరణ్మయిని కలిశారు. ఇంటి నిర్మాణం చేపట్టి రెండు సంవత్సరాలు గడిచినా గృహ లక్ష్మీ బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణం కోసం బయట అప్పులు చేశామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.