లబ్ధిదారులకు ప్రభుత్వ సాయం పంపిణీ

MNCL: మంచిర్యాల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు శుక్రవారం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 283 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి, 44 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.