'చట్ట ప్రకారం వయో వృద్ధులకు సత్వర న్యాయం'
వనపర్తి జిల్లాలో ఎక్కడైనా వృద్ధ తల్లిదండ్రులను తమ పిల్లలు సరైన ఆలనా పాలన నిర్వహించని పక్షంలో వెంటనే ఆర్డీవోకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని బుధవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో వారోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.