VIDEO: 'స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు చర్యలు'
KKD: కాకినాడ నగరంలో స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ NVV సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆయన కాకినాడ నగరంలోని 12వ సర్కిల్‌లో గల 38, 39, 41, 42, 43వ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పర్యవేక్షించారు.