ఏలూరులో జనసేన నూతన కార్యాలయం ప్రారంభం
ఏలూరు 15వ డివిజన్ ఆముదాల అప్పలస్వామి కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని నియోజకవర్గ ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆదివారం ప్రారంభించారు. డివిజన్ ఇంఛార్జ్ పైడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పేదల సమస్యలను తక్షణమే పరిష్కరించే వారే నిజమైన నాయకులని, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం అందుబాటులో ఉంటుందన్నారు.