సిద్దిపేటలో ముస్లింల శాంతి ర్యాలీ

సిద్దిపేటలో ముస్లింల శాంతి ర్యాలీ

SDPT: ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేటలో శుక్రవారం తహరీకే తహవూజ్ సున్నియత్ జమాత్ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఫిర్టోస్ మసీదు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మెదక్ రోడ్డు మీదుగా విక్టరీ చౌరస్తా నుంచి ఇక్బాల్ మినార్ వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.