స్టేడియంగా అభివృద్ధి చేసే దిశగా అధికారులు
KMM: సింగరేణి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న ఆట స్థలాన్ని మినీ స్టేడియంగా అభివృద్ధి చేసే దిశగా అధికారులు శనివారం సర్వే నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశాల మేరకు ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సర్వేని సింగరేణి సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ) దగ్గర ఉండి పర్యవేక్షించారు.