పిడుగు పడి గడ్డివాము దగ్ధం

కృష్ణా: పిడుగు పడి గడ్డివాము దగ్ధమైన సంఘటన కోడూరు మండల పరిధిలోని పిట్టలంక గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం గ్రామంలో మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన మారుబోయిన శివశంకరరావు ఇంటి వద్ద పశువుల మేత కోసం ఉంచిన పది ఎకరాల గడ్డివామిపై పిడుగు పడి దగ్ధమైనది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.