కొమ్మాదిలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు

విశాఖ కేంద్రంగా ఈనెల 22, 23 తేదీల్లో కొమ్మాదిలో జరిగే జోనల్ స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులు ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, క్రీడ, ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు.