సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
AKP: సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పరవాడ డి.ఎస్.పి విష్ణు స్వరూప్ హెచ్చరించారు. గురువారం పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ అరెస్ట్‌లు ఉండవన్నారు. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్, వర్క్ ఫ్రం హోం పేరుతో ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయో వివరించారు. ఈ కార్యక్రమం సీఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు.