'విచారణ పేరుతో వేధించటం సరికాదు'
NLR: గుడ్లూరు మండలం చేవూరులో ఇటీవల జరిగిన మంచినీటి పైప్ లైన్ దగ్ధం కేసులో పోలీస్ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు. చేవూరు వచ్చిన గుడ్లూరు ఎస్ఐ వెంకట్రావుతో ఆయన మాట్లాడారు. ఘటనకు సంబంధంలేని వైసీపీ కార్యకర్తలను విచారణ పేరుతో వేధించటం సరికాదన్నారు.