ప్రమాదపు అంచునా 60 ఏళ్ల నాటి బ్రిడ్జ్

SKLM: జలుమూరు మండలం సుబ్రహ్మణ్యపురం-సారవకోట మండలం చీడిపూడి గ్రామాల వద్ద ఉన్న వంశధార ఎడమ కాలువ బ్రిడ్జ్‌పై నుంచి వరద నీరు పారుతోంది. బ్రిడ్జ్‌పై ఎప్పుడు ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందో అని రెండు మండలాల వారు ఆందోళన చెందుతున్నారు. 60 ఏళ్ల కిందట నిర్మించిన ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని గ్రామస్థులు తెలిపారు. ప్రమాదం జరగకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.