VIDEO: ఎమ్మెల్యే భార్య సర్పంచ్ అభ్యర్థిగా పోటీ
MDK: వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా హైదరాబాదులోని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ సతీమణి నజ్మా సుల్తానా నామినేషన్ వేశారు. ఆమె గతంలో హైదరాబాదులోని కార్వాన్ కార్పొరేటర్‌గా పనిచేశారు. కార్వాన్ ఎమ్మెల్యే కొడుకులు సొంత గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేశారు. ఆ పోటీలో సర్పంచ్‌గా గెలవలేకపోయారు. దీంతో ఇప్పుడు తన భార్య బరిలోకి దిగింది.