లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన తహసీల్దార్
VZM: మొంథా తుఫాన్ నేపథ్యంలో కొత్తవలస మండల తహసీల్దార్ అప్పలరాజు తన సిబ్బందితో మండలంలో లోతట్టు ప్రాంతాలను సోమవారం సందర్శించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని సూచించారు. అనంతరం వీరసాగరం చెరువును పరిశీలించారు. ఆయన వెంట ఎండివో రమణయ్య, ఎంఎఓ ప్రసాద్, రెవెన్యూ పరిశీలకులు షణ్ముఖరావు, వీఆర్వో రాధాకృష్ణ ఉన్నారు.